సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు అడ్జక్షత సభ జరుగుతున్నప్పుడు.. భీమవరం :డెల్టా ప్రాంతంలో సిసి రోడ్లు వేస్తేనే ఆగుతాయని, బిటి రోడ్లు అయితే రోడ్లు త్వరగా పాడవుతున్నాయని అవి మాకు వేయవద్దని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ఐస్ బాక్స్ లతో రాత్రి 10 గంటలకు వాహనాలు రోడ్లపై వెళుతూ ఉంటాయని, ఐస్ వాటర్ పడుతూ వెళ్లడంతో బిటి రోడ్లు పాడైపోతున్నాయన్నారు. మా నియోజకవర్గంలో అన్ని రోడ్లకు సిసి రోడ్లకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామన్నారు. భీమవరం – ఉండి- గణపవరం- నారాయణ పురం రోడ్డు చాలా ఇబ్బందికరమైన రోడ్లని, వాటికీ కనెక్షన్ ఇచ్చి 4 లైన్స్ రోడ్లు వేస్తే ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. భీమవరం – కాళీపట్నం ప్రధాన రహదారికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే అంజిబాబు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *