సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో మధ్య తరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు భారం కాకుండా అండగా కుటమీ ప్రభుత్వం నిలుస్తుందని టిడిపి రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి తోట సీతారామలక్ష్మి తెలిపారు.నేడు, సోమవారం భీమవరం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తుదారులు 36 మందికి 28 లక్షల రూపాయల చెక్కులను టిడిపి నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో వర్తించని వైద్య చికిత్సలకు అప్పు చేసి వైద్య ఖర్చులు కట్టిన పేదలకు తోట సీతారామలక్ష్మి సిఫార్సుతో cm చంద్రబాబు సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించారన్నారు. టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ.. నియోజకవర్గ ఇన్చార్జి తోట సీతారామలక్ష్మి సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నేటికీ సుమారు రెండు కోట్ల రూపాయలను 150 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ టీడీపీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
