సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ద్వారా ఉత్తమ సంగీత విధ్వంసునిగా ఉగాది పురస్కార అవార్డును అందుకున్న భీమవరంకు చెందిన డా పిప్పళ్ల ప్రసాద్ (శ్రీ సాయిబాబా భజనలు లో సుప్రసిద్ధులు) కు శ్రీవిజ్ఞానవేదిక అధ్వర్యంలో భీమవరం శ్రీభీమేశ్వర స్వామి దేవస్థానంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషేన్ రాజు,స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ.. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే సౌమ్యులు ప్రసాద్ అని, ఒక నిర్దిష్ట జీవితాన్ని ప్రసాద్ గడుపుతున్నారన్నారు. ప్రసాద్ గత 4 దశాబ్దాలుగా సంగీత విద్వాంసులుగా అందరినీ మన్ననలను పొందుతూ అవార్డు సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార అవార్డును ప్రసాద్ అందుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. దేశ విదేశాల్లో కూడా సంకీర్తనలు అందించారన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, గనిరెడ్డి త్రినాద్ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక రంగంలో రానున్న రోజుల్లో మరెన్నో పదవులను అధిరోహించాలన్నారు. అనంతరం నిర్వాకులు ప్రసాద్ కు జ్ఞాపికతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *