సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో నేడు, బుధవారం హుండీలు తెరచి లెక్కించారు గత 26 రోజుల కాలానికి భక్తులు హుండీల ద్వారా చెల్లించిన కానుకలు రూ 25,63,619/- ఇరవై ఐదు లక్షల అరువది మూడు వేలు ఆరు వందల పందోమ్మిది రూపాయలు లభించగా బంగారం 30 గ్రాములు 200 మిల్లీగ్రాములు, వెండీ 55 గ్రాములు శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా లభించింది. . కాకినాడ పట్టణం MSN చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్ నాయుడు పర్యవేక్షణలో జరిపిన ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు
బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ,, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు,రామాయణం శ్రీనివాస్,ఉదీశి మీనాక్షి, , జి రమణ, మిర్తిపాటి గుణేశ్వరరావు, అతికెల ఆంజనేయ ప్రసాద్, మల్లువలస లక్ష్మి నిర్మల ,పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *