సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఆకివీడులో 100 ఏళ్ళ రామాలయం పునర్ నిర్మాణం చెయ్యడానికి సిద్ద పడుతున్న డెప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు ఫై స్థానికంగా ఉన్న వేరే మత ప్రజలు ఏ విధంగా అభ్యన్తరం పెట్టారో తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా వైరల్ అయిన విషయం అందరికి తెలసిందే.(మన సిగ్మా న్యూస్ లోనే ఈ ఐటెం కి లక్షలలో వ్యూస్ వచ్చాయి). ఈ నేపథ్యంలో నేడు, శుక్రవారం శ్రీరామనవమి నేపథ్యంలో మరోసరి ఆ రాములోరిని దర్శించుకోవడానికి వెళ్లిన రఘురామా సమక్షంలో ఒక మత వర్గంగా భావిస్తున వారు రాళ్లతో దాడికి ప్రయత్నించడం దానిని అడ్డుకొన్న కూటమి నేతలు ,,మధ్య బాహాబాహీ జరిగింది. ముఖ్యంగా జనసేన నేతలతో వారు ఇనుప మేకుల ఆయుధాలతో దాడికి పాలబడటంతో ఇద్దరి జనసైనికులకు తీవ్ర గాయాలు ఒకరి తలలో ‘మేకు’ దిగిపోగా మరో వ్యక్తి వీపు పదునైన ఆయుధాలతో చేరేశారు. ( బ్లర్ చేసిన ఫై చిత్రంలో చూడవచ్చు ) వీరికి భీమవరం ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించారు. ఇంకా పలువురు ఇరువర్గాల వారు గాయపడ్డారు. ఆకివీడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు. ఈ ఘటన ఫై కూటమి నేతలు గాయపడటంపై రఘురామా ఘటన పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. తాను మతాల ఓట్లకు లబ్ది పొందే నాయకుడిని కాదని, తనపై కూటమి నేతలపై మతం ముసుగులో దాడికి ప్రయత్నించిన ఆగంతకులు ను ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇది వైసీపీ వాళ్ళు చేసారంటే నమ్మనని వాళ్ళు ఇటువంటి వాటిలో దూరే అవకాశం లేదని, అసలు శ్రీ రాములోరి పరిస్థితి వార్త ప్రచారంలోకి తెచ్చిందే సాక్షి దిన పత్రిక అని రఘురామా పేర్కొన్నారు.
