సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏది చేసిన అమెరికా అడ్జక్ష్యుడు ట్రంప్ స్టైలే వేరు.. ఎవరికీ నష్టమైనా సరే.. తన మనస్సు లో ఉన్నది ముక్కు సూటిగా మాట్లాడతాడు.. చెప్పిందే చేస్తాడు..అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన భారతీయులతో సహా విదేశీయులను కాళ్లకు చేతులకు బేడీలు వేసి తిరిగి వారి స్వదేశాలకు గెంటేస్తున్నాడు. డబ్బున్నోడు లా పోజు కొట్టడానికి చాల మంది అమెరికా వస్తారు కాబ్బటి.. అయితే ఇకపై అమెరికన్ పౌరసత్వం కావాలంటే కోట్ల డబ్బుండాలి.. ప్రస్తుతం ఉన్న EB-5 వీసా ప్రోగ్రాంకు బదులుగా ట్రంప్ గోల్డ్ కార్డు వీసా.. తాజగా.. ప్రతిపాదించారు. ఈ పథకం కింద ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరికైనా 5 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.43.54 కోట్లు చెల్లిస్తే పౌరసత్వం ఇచ్చేస్తారు. ప్రధానంగా విదేశీ సంపన్నులను ఆకర్షించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు ట్రంప్. అయితే, యూఎస్ గ్రీన్ కార్డు కోరుకునే విదేశీయులు ఈ నియమం తప్పక పాటించాలి. గతంలో EB-5 వీసా ప్రోగ్రాం కింద కనీసం 8 లక్షల డాలర్లు పెట్టుబడి, 10 ఉద్యోగాలు సృష్టించాలనే నిబంధనే ఉండేది. ఈ గోల్డ్ కార్డు నిబంధనతో అమెరికాలో గ్రీన్ కార్డు కోసం వేలమంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎలాగోలా అప్పులు చేసి సామాన్య ఇన్వెస్టర్లు ఈబీ-5 ప్రోగ్రాంకు అర్హత పొందేవారు. ఇప్పుడు నైపుణ్యం ఉన్నా అధిక మొత్తం పెట్టి కార్డు కొనే పరిస్థితి లేదు. అయితే త్వరలోనే 10 లక్షల కార్డులు విక్రయించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *