సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవ ధర్మమని, సిఎం రిలీఫ్ ఫండ్ పేదవారికి అండగా నిలుస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు రూ 31,04,225 చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అన్ని సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సిఎం రిలీఫ్ ఫండ్ లో ఈ తొమ్మిది నెలల్లో భీమవరం నియోజక వర్గంలో 116 మందికి 1,12,02,476 చెక్కులను అందించామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు.
