సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల కొందరు టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో జరిపిన పెట్రోలు దాడి లో ఇల్లు తగలబడి ఆందోళనకు గురి అయిన మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబాన్ని నేడు, శుక్రవారం పరామర్సించారు. ఈ నేపథ్యంలో జగన్ వెళ్తున్న క్రమంలో, అన్ని రోడ్డులు అభిమానులతో కిక్కిరిసిపోవడంతో ఆయనను చూడాలని, స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ కార్యకర్త రాంబాబు (45) అకస్మా త్తుగా నీరసంతో పల్స్ పడిపోయి మరణించడంతో కృష్ణ జిల్లా, ఇబ్రహీంపట్నం, పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనపై జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసి అభిమాని కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసాఇచ్చారు. జగన్ తాడేపల్లి లోని నివాసం నుండి కేవలం 35 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఇబ్రహీం పట్నం చేరుకోవడానికి జగన్ కాన్వాయ్‌కు అభిమానులు అడ్డుకోవడంతో సుమారు 5 గంటల సుదీర్ఘ సమయం పట్టింది. జోగి రమేష్ ఇంట్లో జరిగిన విద్వంసం, పెట్రో బాంబ్ తో తగలబడిన ప్రాంతాన్ని జగన్ స్వయంగా వీక్షించి .. ఇది జోగి రమేష్ కుటుంబంపై టీడీపీ నేతలు చేసిన హత్య యత్నంగానే చూడాలని, పోలీసులు నిస్సహాయముగా చూస్తున్నారని, రమేష్ కుటుంబానికి జరిగిన అన్యాయం ఫై పోరాడతానని, తిరిగి అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన వారికీ వడ్డీ తో సహా చెల్లించి తీరుతానని హెచ్చరిక జారీ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *