సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 350 సినిమాల హీరోగా దర్శకుడుగా, నిర్మాతగా సూపర్ స్టార్ కృష్ణ అనే పేరు సాధించడానికి పడ్డ కష్టం, సాహసాలు అన్ని ఇన్ని కావు .. మరి తండ్రి సంపాదించిన పేరు ప్రతిష్టలు నిలబెట్టడం కోసం ఆయన కొడుకుగా ఎంత కష్టపడాలి.. మహేష్ కూడా చిన్ననాటి నుండి సినిమాలు చేస్తూ ఆ కష్టం అనుభవించాడు కాబట్టే.. కృష్ణ అందచందాలు వారసత్వంగా తెచ్చుకొన్న మహేష్ బాబు ముందు సూపర్ స్టార్ చేరినప్పు డు ఎవరూ పెద్దగా విమర్శించలేదు. మహేష్ బాబు కు ఆ అర్హత ఉంది. చూస్తుండగానే మహేష్ బాబు నేడు, 50 వ జన్మదినం జరుపుకొంటున్నారు. భీమవరం లో కూడా పలుచోట్ల మహేష్ అభిమానులు వేడుకలు చేస్తున్నారు. మహేష్ బాబు కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాజమౌళి సినిమా లోని ఫిస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. దీనిలో మహేష్ మేడలో లాకెట్ మీద ముందుగా శివుడి బొట్టు, త్రిశులం నంది ఉండటం కధ గమనంపై అభిమానులకు పజిల్ విసురుతుంది. ఈ సినిమా మహేష్ బాబును భారీ అంచనాలతో వరల్డ్ వైడ్ స్టార్ గా నిలబెట్టనుంది. ఇక మహేష్ బర్త్ డే సం దర్భం గా ఇవాళ అతడు మూవీ 4కె వెర్షన్ ని నేడు, శనివారం మరోసారి రీ రిలీజ్ చేశారు
