సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల దేశంలో 500 రూపాయల నోటు విషయంలో ఎవరు పుట్టించారో కానీ ఒక విచిత్ర ప్రచారమే జోరుగా నడుస్తోంది. అదేంటంటే.. ఐదు వందల రూపాయల నోటుపై ఆకు పచ్చ రంగులో ఉండే మెరుపు తీగ (సెక్యురిటీ థ్రెడ్).. ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా మహాత్మా గాంధీ బొమ్మకు దగ్గరగా ఉంటే గనుక ఆ నోటు ఫేక్‌ అని, చెల్లదు అని!. ఈమేరకు ఆర్బీఐ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయంటూ ఓ వీడియో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో వైరల్‌ అవుతోంది కూడా. దీంతో 500 రూపాయల నోటు తీసుకునేందుకు వ్యాపారులు వణికిపోతున్నారు. అయితే 500 నోట్లపై ఉండే గ్రీన్ స్ట్రిప్.. ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా గాంధీ బొమ్మకు దగ్గరిగా ఉంటే ఆ నోటు చెల్లదు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, RBI సైతం ఎలాంటి అలర్ట్‌ జారీ చేయలేదని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో స్పష్టంచేసింది. అంతేకాకుండా ఆ రెండు నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని పీఐబి (PIB) తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ వీడియో నకిలీదంటూ ఓ పోస్ట్‌ను ట్విటర్‌లో ఉంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *