సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కొత్తగా ప్రభుత్వ శాఖల్లోకి తీసుకున్న 51,000 మందికి నియామక పత్రాలను నేడు, శనివారం పంపిణీ చేశారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నియామక పత్రాలను ఆయన పంపిణీ చేశారు. రోజ్‌గార్ మేళా’ కింద ఇంతవరకూ లక్షలాది మంది యువకులకు నియామక పత్రాలను అందజేసినట్టు ప్రధాని మోదీ ఈ సందర్భంగా వివరించారు. కొత్తగా ఉద్యోగాల్లో తీసుకున్న వారికి శుభ అభినందనలు తెలిపారు. కొత్తగా రిక్రూట్ అయిన వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఉత్సహంగా మాట్లాడారు.
