సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ నేడు, మంగళవారం పుట్టపర్తిలో వైయస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ కార్యక్రమంలో లక్షమంది పైగా పాల్గొన్నబహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. 53 నెలల్లో గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం హయాంలో జరగని విధంగా చూడని విధంగా రైతులకు పెట్టుబడి సాయం చేశామన్నారు. వైయస్సార్ రైతు భరోసా ద్వారా ప్రతి యేటా 53 లక్షల మంది రైతులకు 13500 కోట్లు ఇచ్చామని చెప్పారు. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం ఇదే అని అన్నారు. పంటల భీమాకు ప్రీమియం చెల్లిస్తూ రైతన్నలకు తోడుగా ఉంటున్నామన్నారు. దేవుడు దయతో ఐదు సంవత్సరాలు ఎక్కడా కరువు లేదన్నారు. చంద్రబాబు హయాంలో ఐదు సంవత్సరాలు కరువే కరువు అంటూ వ్యాఖ్యలు చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి గతంలో చంద్రబాబు ఏమీ చేయలేదన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాప్ ద్వారా ప్రత్యేక ఎకరా నమోదు చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *