సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండడంతో తుపానుగా మారే ప్రమాదం ఉందని నేడు, శనివారం సాయంత్రం నుండి రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో గంటకు 50 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గోదావరి జిల్లాలపై దీని ప్రభావం 2 రోజులు పాటు ఉండే అవకాశం స్వష్టంగా ఉంది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, భీమవరం మండలంలోని మత్యకారులకు సముద్రంలో వేటకు వెళ్లరాదని, బొట్లు తిరిగి రావాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.
