సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం అమరావతిలో సీఎం చంద్రబాబు ఇటీవల నిర్వహించారు. దీనికి చాల తక్కువమంది మాత్రమే ఎమ్మెల్యేలు హాజరు కావడంతో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏడాది పాలనా పూర్తీ అయిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రజలను ఇంటిటికి వెళ్లి కలవవలసిందేనని ఎంతో కీలకమైన ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఇచ్చిన వారిలో ఏకంగా 56 మంది గైర్హాజరయ్యారు. ఇందులో మిగతా 15 మంది ఎమ్మెల్యేలు విదేశాలలో ఉండటంతో సీరియస్ అయ్యారు. మరికొంత మంది ఉదయం వచ్చి సంతకాలు పెట్టి బయటకు వెళ్లిపోయారు. దీంతో సమావేశం చివరి వరకు ఎవరెవరు ఉన్నారో తనకు తెలుస్న, ఇందులో చాలామంది కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు ఉన్నారని ఇప్పుడే ఇంత నిర్లక్ష్యంగా ఉంటె ఇక నియోజకవర్గ ప్రజలను ఎలా ఉద్ధరిస్తారని, ప్రజలతో ఉంటేనే మనకి భవిష్యత్తు ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. మరి కొందరు మన కార్యక్రమం ఉందని తెలిసి కూడా తానా, ఆటా సభలు అంటూ విదేశాలకు , దైవ దర్శనాలకు వెళ్లిపోవడం ఏమిటని? ప్రతిపక్షా నేతలు కూడా పొట్టేలు తలలు నరికినట్లు.. బెదిరింపు ధోరణిలో మాట్లాడుతుంటే వారిని అధికారం ఉండికూడా అడ్డుకోవడం కూడా రాని వారు, ఖండించే బాధ్యత లేని వారికీ.. రాజకీయ భవిషత్తు ఉండదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
