సిగ్మాతెలుగు డాట్ న్యూస్: భీమవరం గునుపూడి లో పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ముగిసాయి. ఈ నేపథ్యంలో వేలాది భక్తుల భద్రత ఏర్పాట్లు ను చక్కగా పర్యవేక్షించిన భీమవరం వన్ టౌన్, టూ టౌన్ సీఐ లు, ఎస్ ఐ లకు పోలీసులకు దేవాలయ ఇఓ రామకృష్ణంరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపి కండువాలు కప్పి సత్కరించారు. ఇక నేడు, సోమవారం ఉదయం గత 58 రోజులకు గాను హండీలు భక్తులు సమర్పించిన కానుకలను జిల్లా దేవదాయ శాఖ అధికారి వారి పర్యవేక్షణలో,భక్తులు, ధర్మకర్తలు మరియు గ్రామస్తుల సమక్షములో తెరచి లెక్కించగా రూ.10,37,912/- ఆధాయం వచ్చింది. ఈ లెక్కింపు నందు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులైన, కుర్మదాసు సత్యశ్రీనివాస్, నాచుశ్రీవల్లి, లక్కు త్రిమూర్తులు, నల్లం రఘుబాబు, చెల్లబోయిన సూర్యప్రకాష్, శ్రీమతి సోమాదుల లీలా ఈశ్వరి, తాణాల రామకృష్ణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *