సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ధర్మాదాయ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో .. హిందువులు మహాశక్తి శ్రీ అమ్మవారికి ప్రీతిపాత్రమైన నేడు, శుక్రవారం రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహా యజ్ఞం ను సీఎం జగన్ సాంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి ను వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రారంభించారు. . ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం శ్రీలక్ష్మీ మహా యజ్ఞం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా యజ్ఞ సంకల్పం తీసుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ తో కలసి, గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కపిల గోవుకు హారతి ఇచ్చి, అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వేదపండితులు సీఎం జగన్‌కు ఆశీర్వాదం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరంగా ప్రపంచ వ్యాప్తంగా హిందువులలో ఆధ్యాత్మిక శోభ పెంపొందేలా నేటి నుంచి ఆరో రోజులపాటు అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం లు నిర్వహిస్తున్నారు.1,008 మందితో విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ప్రముఖ పీఠాధిపతుల ప్రవచనాలతో పాటు సాయంత్రం 6గంటల నుండి ప్రముఖ ప్రవచన కర్త.. చాగంటి కోటేశ్వరరావు చే ప్రవచనాలు ఉంటాయి.ఆఖరి 6వ రోజు శ్రీ స్వరూపానంద స్వామి యాగాన్ని పరిపూర్ణం చేస్తారు. ఈ కార్యక్రమాలు టివి ఛానెల్స్ లో ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేసారు. స్టేడియంలో ప్రతి రోజు 15 వేల మంది భక్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేసారు.
