సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, సోమవారం( ఫిబ్రవరి 20వ తేదీ ) ఉదయం భీమవరం మండల పార్టీ అధ్యక్షుడు, మండల JCS కన్వీనర్, సచివాలయ కన్వీనర్లు తో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ‘ మా నమ్మకం మీరే జగనన్న’ కార్యాక్రమంలో భాగంగా పట్టణంలోని మార్కెట్ యార్డులో సమావేశం లో మాట్లాడుతూ.. జగన్ సర్కార్ అందిస్తున్న ప్రజా సంక్షేమాలు దేశంలో ఎవరు అందించడం లేదని ప్రజలలోకి తీసుకొనివెళ్ళాలని, ఇచ్చిన అన్ని హామీలు జగన్ నెరవేరిస్తే .. ఇటీవల జగన్ సర్కార్ ఫై అబాండాలు వేస్తున్న చంద్రబాబు 2014 లో బీజేపీ, జనసేన మద్దతుతో కేవలం 1న్నర శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చి మరల విలువలు వదిలేసి ముగ్గురు ఎంపీలను 23 వైసిపి ఎమ్మెల్యేను దొంగిలించి మంత్రి పదవులు కట్టబెట్టిన ద్రోహి అన్నారు. ఆ ఎన్నికల్లో ప్రజలకు 600 వాగ్దానాలు ఇచ్చి ( రైతుల కు రుణమాపీ, బాబు వస్తే జాబు వస్తుంది.. డ్వాక్రా మహిళలకు రుణమాపీ వంటివి ..) వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని, స్వర్గీయ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయి మరల టీడీపీ లో మామగారి పంచన చేరి వంచన తో వెన్నుపోటు పొడిచి పార్టీని, సీఎం పదవిని కూడా దోచేసి అసెంబ్లీ లో పెద్దాయన ఎన్టీఆర్ కు కనీసం బాధ చెప్పుకోవడానికి మైక్ ఇవ్వడానికి నిరాకరించిన క్రూరుడు చంద్రబాబు చెప్పే దొంగ మాటలు ప్రజలు ఇంకా నమ్ముతారని ఎవరు అనుకోరని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భీమవరం మండల జెడ్ పిటిసి తో పాటు నాగిడి పాలెం, దెయ్యాల తిప్ప, కోమటితిప్ప నార్త్, దిరుసుమర్రు, నరసింహాపురం, యనమదుర్రు, కొవ్వాడ అన్నవరం, తుందర్రు, జొన్నలగరువు, వెంప, శ్రీరాంపురం బేతపూడి, తాడేరు, పెదగరువు గ్రామ ఎంపిటిసిలు ,సచివాలయాల కన్వీనర్లు, సభా నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *