సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి అని, ఆరోగ్యపరంగా అండగా ఉపయోగపడుతుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం 61 మంది లబ్ధిదారులకు రూ 32,03,132 ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. ఇప్పటి వరకు భీమవరం నియోజకవర్గంలో 637 లబ్ధిదారులకు రూ 5 కోట్ల 11 లక్షల 85 వేల 177 లను అందించామని, అర్హత ఆధారంగా ప్రతిఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నామన్నారు. వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులైన పేదలకు సకాలంలో సాయం అందుతోందన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *