సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక యూనిట్ రక్తం ముగ్గురు జీవితాలను కాపాడుతుందని, రక్తదానం అనేది ఒక స్వచ్ఛంద చర్య అని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేడు, శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఎక్కువ సార్లు రక్తదానం చేసిన 5 గురు రక్తదాతలను ఎమ్మెల్యే అంజిబాబు సత్కరించారు. అపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని, రక్తదానం చేయడం ప్రాణాలను కాపాడటమేనని, రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే అపోహలు వీడాలన్నారు. 18 ఏళ్ళ నుండి 55ఏళ్ల లోపు ఎవరైనా రక్తదానం చేయవచ్చునని, అన్నారు. రక్తదాతలు బోడపాటి పెదబాబు 64 సార్లు, కొప్పినిడి బాబీ 63 సార్లు, కెవిఎల్ 43 సార్లు, చల్లా రాము 25 సార్లు, చీడే చందు వాలంటరీ క్యాంప్ లు నిర్వహించారని అన్నారు. అనంతరం వారిని సత్కరించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు
