సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణం శివారు ఉండి రోడ్డులో ఉన్న, కోట్ల ఫంక్షన్ హాల్ లో రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారంలలో (డిసెంబరు 3 ,4 తేదీలలో )’ 20 వ ఆక్వా టెక్ ఎక్స్పో రెండు రోజులు కార్యక్రమాలు జరుగును, రాష్ట్ర స్థాయిలో,చేపలు, రొయ్యల రైతులు, ఆక్వా వ్యాపారులు కోసం ఏర్పాటు చేయబడుతున్న ఈ ఎగ్జిబిషన్ లో జరిగే ఆక్వా ఉత్పతులు ప్రదర్శనలు, ఆధునిక ,టెకనాలజి , సెమినార్ లు,కార్యక్రమాలకు భీమవరం ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ , ఉండి ఎమ్మెల్యే రామరాజు తో పాటు ముఖ్య అతిధులుగా ఉప ముఖ్యమంత్రి,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆళ్ళ.కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని ), శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేన్ రాజు,జిల్లా ఇంఛార్జి మంత్రి,రాష్ట్ర సమాచార శాఖ మంత్రి, పేర్ని. వెంకట్రామయ్య (నాని ) , జిల్లా కలెక్టర్, కార్తి కేయ మిశ్రా, పశుసంవర్ధక ,మత్స్య శాఖ శాఖ మంత్రి, సీదిరి.అప్పల రాజు, జిల్లా మంత్రులు , పార్ల మెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు తదితరులు పాల్గొబోతున్నారని సమాచార శాఖ తెలిపింది.
