సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం కాబినెట్ మీటింగ్ ముగిసాక ఇటీవల జరుగుతున్న పరిణామాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. తప్పు చేసిన వారు సొంత పార్టీ నేతలైనా ఊరుకునేదే లేదు.. సొంత పార్టీ కదా అన పిచ్చి పిచ్చి వేషాలేస్తే సహించనని టీడీపీ లోని 7 గురు ఎమ్మెల్యే లకు హెచ్చరికలు జారీ చేశారు అని వార్త సమాచారం. అయితే తాజగా అటవీ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ( తన కోసం ఫారెస్టు చెక్‌పోస్టు గేటు తీయలేదని, అదే ఆవేశంలో అక్కడికి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ పెట్రోలింగ్ సిబ్బందిని పిలిచి వారిని బలవంతంగా పెట్రోలింగ్ వాహనంలో కూర్చోపెట్టి మరీ చిత్రహింసలు పెట్టారు. ఆ వాహనాన్ని స్వయంగాఎమ్మెల్యే బుడ్డానే నడిపినట్టు తెలుస్తోంది. తన అనుచరులతో కూడా పోలీసులపై దాడి చేయించారు. ఈ మొత్తం ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ) సీఎం చంద్రబాబు పారెస్ట్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేయాల్సిందేనంటూ పోలీసులకు ఆదేశాలు చేశారు. అలాగే ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బుడ్డాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *