సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని నరేంద్ర మోడీ మరో 4 రోజులలో రాబోతున్న దీపావళి పండుగకు దేశవ్యాప్తంగా 75వేల మంది యువతకు అపూర్వ గిఫ్ట్ ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా ప్రధానమం త్రి నరేంద్ర మోదీ. దీపావళికి రెండు రోజుల ముందు శనివారం వారితో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశమై వివిధ అంశాలపై మాట్లాడనున్నారు. 75వేల మంది యువతకు ప్రభుత్వ విభాగాలు, రక్షణ, రైల్వే , హోం, కార్మిక, ఉపాధి శాఖలు, తపాలా విభాగం , సీఐఎస్ఎఫ్, సీబీఐ, కస్టమ్స్ ,బ్యాంకింగ్వంటి రంగాల్లోవారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు. వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. అదే రోజు వారికి ఉద్యో గ నియామక పత్రాలు(అపాయిం ట్మెం ట్ లెటర్స్ )కూడా అందించనున్నారు. ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సమావేశం కార్యక్రమానికి కేంద్ర మంత్రులు , ఉద్యొగాలు పొందిన యువతకు చెందిన పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీలు కూడా హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *