సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో కేవలం ఏపీ అసెంబ్లీ లో మాత్రమే బలమైన స్థానం లో ఉన్న కూటమి ప్రభుత్వానికి. అటు కీలకమైన శాసనమండలితో సహా దాదాపు అన్ని మున్సిపాలిటీ లు , కార్పొరేషన్స్ జడ్పీటిసి లు మండలాలు పంచాయితీలతో సహా రాష్ట్రంలో స్థానిక సంస్థలలో ప్రతిపక్ష వైసీపీ ప్రజా ప్రతినిధులే ఇప్పటికే బలంగా ఉన్నారని, పార్టీపై జగన్ తన పట్టు నిలుపుకొంటున్నారని వాస్తవం అర్ధం అయ్యింది. అందుకే తాజగా నేడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియాతో రాష్ట్రంలోని పంచాయితీ వ్యవస్థపై మాట్లాడుతూ.. నేను వచ్చి కొద్దీ నెలలు మాత్రమే అయ్యింది. పంచాయితిల సాధక బాధలు అర్ధం చేసుకొంటున్నాను. వెంటనే అద్భుతం చేసి అభివృద్ధి చేసెయ్యడానికి నా దగ్గర మంత్ర దండం లేదు. ఇప్పటికి రాష్ట్రంలో . 75 శాతం గ్రామాల్లో వైసీపీకి చెందిన సర్పంచ్‌లే ఉన్నారన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు పంచాయితీలను పట్టించుకోలేదు. అయితే అందరు మాతో కలసి రావాలి. రాజకీయాలకు అతీతంగానే అభివృద్ధే కూటమి లక్ష్యమన్నారు. దేశభక్తి పంచాయతీల నుంచే రావాలన్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. పదవులు తనకు అలంకరణ కాదని.. బాధ్యత అని, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవసరమైతే గూండా యాక్టు కూడా తెస్తామన్నారు. డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. చంద్రబాబు లాంటి నేత అపార అనుభవం ఏపీకి అవసరమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *