సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని గత శుక్రవారము రాత్రి కలుసుకున్నా రు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం లో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ శుక్రవారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి వచ్చారు.అక్కడి నుండి ప్రధాని మోడీ విడిది చేసిన తూర్పు నౌకాదళ స్థావరంలోని ఐఎన్ఎస్ చోళ అతిథిగృ హానికి చేరుకున్నారు. తొలుత పవన్,మనోహర్ ఇద్దరూ ప్రధానిని కలిశారు. అయితే .తర్వాత మోదీ, పవన్ కల్యా ణ్ ఇద్దరే 20 నిమిషుల పాటు మాట్లాడుకున్నారు.ప్రధాని మోదీతో జరిగిన భేటీ అనం తరం పవన్ మీడియాతో మాట్లాడారు. ‘చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సమావేశం జరిగింది.ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా పీఎం వో నుంచి పిలుపు వచ్చింది. ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాని మోదీని కలిశాను. ఎప్పుడో 2014లో భాజపా గెలిచిన తర్వా త ప్రధానిగా ఆయన ప్రమాణస్వీకారం చేసే ముందు కలిశాను. ఆ తర్వాత అనేకసార్లు ఢిల్లీ వెళ్లినా ఎప్పు డూ కలవలెకపొయాను. ఈ సమావేశం వెనుక ముఖ్య ఉద్దేశం ఉంది. ప్రధాని మోదీ కూడా కలవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఏపీ ప్రజలు అభివృద్ధి చెందాలనేదే ఆయన ఆకాంక్ష. ఇక్క డి అన్ని విషయాలు అడిగితెలుసుకున్నారు. నాకు అవగాహన ఉన్నంత మేరకు అన్ని విషయాలు ప్రధానికి తెలియజేశాను. ఈ సమావేశం భవిష్యత్తులో ఆ ధ్రప్రదేశ్ కు మంచి రోజులు తీసుకువస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను’ అని పవన్ ప్రకటించారు
