సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న ఆదివారం కేందం ఆర్ధిక బడ్జెట్ ప్రవేశపెట్టడం తో దాని ప్రభావంతో నేడు, సోమవారం భారత స్టాక్ మార్కెట్లు రాకెట్లా దూసుకెళ్లాయి. నేడు ఉదయం మార్కెట్ మొదలైన మొదటి గంటలో కొంత నష్టాలు కనిపించాయి (సెన్సెక్స్ 80,387 వరకు దిగింది). అయితే మధ్యాహ్నం క్రమంగా కొనుగోళ్లు పెరిగాయి.సెన్సెక్స్: 943 పాయింట్లు (సుమారు 1.17%) పెరిగి 81,666 వద్ద ముగిసింది. నిఫ్టీ 50: 263 పాయింట్లు పెరిగింది. (సుమారు 1.06%) ఎగిసి 25,088 వద్ద స్థిరపడింది. నిన్న సెన్సెక్స్ 1,547 పాయింట్లు (1.88%) నష్టపోయి 80,723 వద్ద ముగియగా, నిఫ్టీ 495 పాయింట్లు (1.96%) కిందకు వచ్చి 24,825 వద్ద క్లోజ్ అయిందిరూపాయి కూడా బలపడి 91.51 వద్ద ముగిసింది (మునుపటి 91.99 నుంచి బలోపేతం).
