సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరం లో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మరియు సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరియు మైనారిటీ నేతలు, వైసిపి కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. . గౌరవ ముఖ్యమంత్రి జగన్, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు వికలాంగులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహం సందర్భంగా “వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా” పథ‌కాల ద్వారా వివాహ వేడుకలలో ఆ కుటుంబాలకు 1 లక్ష 20వేల రూపాయలు వరకు ఆర్ధిక సహాయం అందజేసే కార్యక్రమాన్ని నూతనంగా చేప్పట్టడం తో ఆయా కుటుంబాల ఆడపిల్లల వివాహ ఖర్చులో కూడా ప్రభుత్వం తరపున భాగస్వాములు అవుతున్నారని, దీనితో దేశ చరిత్రలో ఎవరు చెయ్యని విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో 98.55 శాతం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన సందర్భంగా ఆయనకు కృతజ్ఞత పూర్వకంగా యస్సీ, యస్టీ, బీసీ,మైనారిటీ సోదరులు, సీఎం జగన్ కు ఆయన తండ్రి వై యస్ కు పాలాభిషేకం నిర్వహించడం హర్షణీయం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *