సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక హిందూ గురువుగా ప్రసిద్ధి పొందిన ద్వారకా పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి చాల కాలంగా సుదీర్ఘ అస్వస్థతతో నేడు, ఆదివారంనాడు పరమపదించారు. 99 ఏళ్ల స్వరూపానంద సరస్వతి మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లో ఉన్న శ్రీథామ్ జోతేశ్వర్ అశ్రమ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు తుది శ్వాస విడిచారు. 1924లో జన్మించిన శంకరాచార్య స్వామి 2018లో బృందావనంలో తమ 95వ జన్మదినం జరుపుకోగా, పరమేశ్వరుడు పార్వతీ దేవిని భార్యగా స్వీకరించిన రోజుకు గుర్తుగా ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకొనే హరియాలి తీజ్ రోజున ఆయన తన 99వ పుట్టినరోజు జరుపుకొన్నారు. షిర్ది సాయి బాబా ఫై తరచూ ఈయన చేసిన వివాదాస్వాద వ్యాఖ్యలు దేశవ్యాప్తము గా 6 ఏళ్ళ క్రితం సంచలనం రేపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *