సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని మెంటే వారి తోట లో వండర్ కిడ్స్ స్కూల్ నుండి బైపాస్ రోడ్డు ను కలుపుతూ సరికొత్త విశాలమైన సీసీ రోడ్డు దాదాపుగా నిర్మాణం 4నెలలు క్రితమే పూర్తీ అయ్యినప్పటికీ అధికారికంగా నేడు, బుధవారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు, ఈ రోడ్డు నిర్మాణం వెంటనే ప్రారంభించాలని, నిధులు కేటాయించాలని 2022 సెప్టెంబర్ 12న భీమవరం మునిసిపల్ ప్రత్యేక ఇంచార్జి అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రతిపాదనలను ఇచ్చి, మొత్తానికి 99 లక్షల రూపాయల మునిసిపల్ నిధులు సాధించి పూర్తీ చేసిన ఈ సిసి రోడ్డును నేడు, బుధవారం స్థానిక 1మరియు 2వ వార్డుల ప్రజలు మధ్య అధికారికంగా ప్రారంభించి కాలినడకన వారితో రోడ్డు ఆసాంతం నడిచారు, మెంటే వారి తోట 1వ వార్డులో నిర్మించిన వైఎస్సార్ పార్టీ జెండా స్తూపాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఇక కీలకమైన ఈ రోడ్డు నిర్మాణం విషయానికి వస్తే..అర కిలో మీటర్ పైగా ఉన్న రోడ్డుకు ఇరువైపులా సుమారు 8 నెలల క్రితం స్థానిక ప్రజల సహకారంతో ,ఆక్రమణలను, చెట్లను తొలగించడమే కాదు.. అంతే శరవేగంగా కేవలం 4 నెలలలో విశాలంగా నిర్మించి రోడ్డుపై అనధికారికంగా ఆగస్టు చివరి వారం నుండే వాహనాల రాకపోకలు సాగించారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *