సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కు సీఎం జగన్, నేటి సోమవారం ఉదయం 11గంటల 10 నిమిషాలకు చేరుకొన్నారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు, కలెక్టర్ పి ప్రశాంతి తో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తదుపరి నియోజకవర్గంలో 3300 కోట్ల రూపాయలు పైగా నిధులతో పలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ను సీఎం జగన్ నిర్వహించారు. వీటిలో కీలకమైనవి ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన, ఉప్పుటేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.ఆక్వా యూనివర్సిటీ శంకుస్థాపన నేపథ్యంలో సీఎం జగన్ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భముగా ముమ్ముడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మాట్లాడుతూ.. రాష్ట్రములో తొలిసారి 23 వేల మంది మత్స్య కారులకు రూ. 107 కోట్ల పరిహారం అందిస్తున్నా ఘనత జగన్ సర్కారుదే అన్నారు. .అనంతరం నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనాన్ని సీఎం జగన్ ప్రారంభిం చారు. నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని కూడా సీఎం జగన్ ప్రారంభించారు. మధ్యాహ్నం 1గంట దాటాక ప్రజలనుద్దేశించి బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
