సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నరసాపురంలో సీఎం జగన్ రూ.1,400 కోట్లతో పశ్చిమ గోదావరి జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసారు. 30 నెలల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా, సీఎం జగన్ ప్రకటించారు. రూ.1,400 కోట్ల తాగునీటి పథకానికి కూడా గోదావరి నుంచి ఏటా 1.374 టీఎం సీల నీటిని వినియోగిస్తారు. దీనితో పశ్చి మ గోదావరి జిల్లాలో ఆక్వా వ్యవసాయం వల్ల ఏర్పడిన తీవ్ర నీటి కాలుష్యంతో పాటు తీర ప్రాంతంలో ఉప్పు నీటి సాంద్రత కారణంగా నెలకొన్న తాగునీటి ఎద్దడిని ఇకపై శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ వాటర్ గ్రిడ్ పథకం ఉపయోగపడుతుంది. దీనితో నరసాపురం , భీమవరం ,ఉండి, నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం (కొంత భాగం )ఆచంట, పాలకొల్లు, ఉంగుటూరు, దెందులూరు (కొంత భాగం ), పరిధిలోని 26 మండలాల ప్రజలకు ఏడాది పొడవునా తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. మొత్తం 1,178 గ్రామీణ నివాసిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయిని ఏర్పాటు చేసి రోజూ సగటున ప్రతి వ్యక్తికి 55 లీటర్ల సురక్షిత తాగునీటి సరఫరా చెయ్యాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసారు.
