సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం ఆవరణలో నేడు, బుధవారం అమావాస్య సందర్భంగా వేదపండితులతో, ప్రజల శాంతి సౌభాగ్యాలు కోసం అమ్మవారిని ప్రార్ధిస్తూ చండి హోమం నిర్వహించారు. ఈ చండి హోమం లో విశేషంగా భక్తులు పాల్గొనడం జరిగింది. పవిత్ర కార్తీక పౌర్ణమి ఆఖరి రోజు కావడంతో వేలాదిగా భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొన్నారు. శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి భీమవరం వాస్తవ్యులు, గొట్టుముక్కల శివాజీ రాజు శ్రీమతి మాధవి దంపతులు 4 గ్రాముల బంగారం కానుకగా అందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *