సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల వైకుంఠ‌పురంలో’ వంటి క్లాస్ మూవీ త‌ర్వాత క్లాసికల్ టాలెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అనే ప‌క్కా ఊర మాస్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప: ది రైజ్ పార్ట్ 1’ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు ఐకాన్ స్టార్, అల్లు అర్జున్, రష్మిక జంటగా.. పుష్ప.. ‘నేడు, శుక్రవారం తెలుగు , హిందీ, కన్నడ, తమిళం బాషలలో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యింది. ఇక మలయాళం రేపు విడుదల చేస్తారు. ఈ సినిమా భారీ అంచనాలు తో రిలీజ్‌కు ముందే 250 కోట్ల వరకు ప్రీ రిజీజ్ బిజినెస్ చేసిందని ఫిల్మ్ వర్గాల సమాచారం. సినిమా ఫై టాక్ సింపుల్ గా చెప్పాలంటే.. ఫస్ట్ ఆఫ్ బాగుంది. సెంకండ్ ఆఫ్ అంత స్పీడ్ లేదు.. అయితే అల్లు ఒకరేంజ్ లో క్యారెక్టర్ లో అల్లుకుపోయాడు. అంత బాగానే కష్టపడ్డారు కానీ, క్లైమాక్స్ ఇంకా ఎదో మిస్ అయ్యిందట? ఎలాగూ త్వరలో రానున్న పుష్ప 2 కు ట్విస్టులతో క్లైమాక్స్ ప్లాన్ చేసిఉండవచ్చు.. పబ్లిక్ టాక్ ఏమిటంటే.. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా అల్లు అర్జున్ చిత్తూర్ యాసతో మాస్ ఎంట్రీ అదిరిపోయింది. వాయిస్ ఓవర్‌తో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. ఫస్ట్ సాంగ్ దాక్కో దాక్కో మేక వచ్చి బన్నీ మాస్ స్టెప్పులతో అలరిస్తాడు ఇక మంగళం శీనుగా, భీమవరం బుల్లోడు సునీల్‌, విభిన్నతరహా నెగిటివ్ పాత్ర పోషించాడు. ఎక్కడ నవ్వడు.. ద్రాక్షాయణిగా అనసూయ డిఫరెంట్ రోల్ బాగుంది. బన్నీతో సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా… ఊ ఊ అంటావా’ తో థియేటర్స్ లో మంచి జోష్.. . ఈ సాంగ్ తర్వాత భారీ యాక్షన్ సీన్.. “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్” అంటూ బన్నీ చెప్పిన మాస్ డైలాగ్‌తో ఇంటర్వెల్. ఇప్పటి వరకు కథ ఎంతో ఆసక్తి కరంగా సాగింది. మలయాళం లో విలక్షణ నటుడు ఫాజిల్ పాత్ర నిడివి తక్కువ.. పుష్ప 2 వ పార్ట్ లో మెయిన్ రోల్ కావచ్చు..మొత్తానికి అల్లు అర్జున్ పుష్పరాజ్ గా చెలరేగాడు. అయితే సినిమా ఏ రేంజ్ హిట్ అన్నది మరో 4 రోజులలో నిర్ధారణ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *