సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీ హైకోర్టుకు చెందిన న్య యమూర్తుల బదిలీలను నిరసిస్తూ నేడు, శుక్రవారం న్యాయవాదులు కోర్ట్ ఆవరణలో ఆందోళన వ్యక్తం చేశారు. ( ఫై ఫొటోలో చూడవచ్చు). ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానం ద్, జస్టిస్ రమేశ్ బదిలీ ఫై నిరసన తెలిపారు. ఈ మేరకు హైకోర్టులో విధులు బహిష్కరించి న్యాయవాదులు నిరసన తెలిపారు. వివరాలలోకి వెళ్ళితే.. వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గత గురువారం సిఫార్సు చేసింది. ఇందులో తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్, మద్రాస్ హైకోర్టుల నుంచి ఇద్దరి చొప్పున న్యాయమూర్తులును బదిలీ చేసారు. తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ కన్నెగంటి లలితను కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ డాక్టర్ డి.నాగార్జునను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ ఏ.అభిషేక్ రేడ్డిని పట్నా హైకోర్టుకు, ఏపీ హైకోర్టు నుంచి జస్టిస్ బట్టు దేవానంద్ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ డి.రమేష్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *