సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ పోలీసులు షర్మిల అరెస్ట్ తో వేలాది వై యస్ అభిమానుల సమీకరణతో హైదరాబాద్ లో ఉద్రిక్తంగా మారడం ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలన ఘటనగా నమోదు అయిన వైఎస్సార్టీపీ (YSRTP)అధినేత్రి వైఎస్ షర్మిలకు గత మంగళవారం రాత్రి నాంపల్లి కోర్ట్ ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.ఆమె పాదయాత్రకు కూడా కోర్ట్ అనుమతించింది. బెయిల్ మంజూరు అనంతరం లోటస్పాండ్ లోని ఇంటికి చేరుకుని షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదిరించినందుకే తనను, తన పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసారని విమర్శించారు. నిజానికి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. తాను ప్రజల పక్షాన నిలబడటం తప్పా? అని ప్రశ్నించారు. మహిళా నేత హక్కులు కాజెయ్యడానికి ఇది పాకిస్తానా.. ఆప్ఘనిస్తానా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.పోలీసులు అధికారుల్లా కాకుండా.. రౌడీల్లా వ్యవహరించారని మండిపడ్డారు. మా కార్యకర్తలను పోలీసులు ఎందుకు కొట్టారు? అరెస్ట్ చేసిన తర్వాత కొట్టాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.పోలీసులు టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారని షర్మిల ధ్వజమెత్తారు. షర్మిల అరెస్ట్ ను నిరసిస్తూ విజయమ్మ చేసిన నిరసన దీక్ష నిన్న రాత్రి విరమించారు. ఇక షర్మిల స్టాండ్ వేరైనప్పటికీ ఆమె ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చెయ్యడం తమకు బాధాకరమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రకటన చెయ్యడం, బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే షర్మిల అరెస్ట్ తో కెసిఆర్ తన అహంకారాన్ని చాటుకొన్నారని విమర్శించడం కీలక అంశాలు.
