సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం ఏలూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలపై దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను తమ్మిలేరులో ఇసుక తవ్వినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సవాల్ విసిరారు. మాజీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంతులేని దుష్ట పాలన కు ముగింపు పలికి దెందులూరును అభివృద్ధి చేయాలనే ఉద్దేశం తోనే లండన్ నుంచి వచ్చాను. ప్రజా అభిమానంతో వై యస్ జగన్ సహకారంతో ఎమ్మెల్యే అయ్యి, నా నియోజకవర్గనికి చెందిన యువతకు వేలాది ఉద్యో గాలు ఇప్పించా. అయినా చంద్రబాబు నాపై వ్య క్తిగత విమర్శ లు చేస్తున్నారు. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నా 3న్నర ఏళ్ల పాలనా హయాంలో దెందులూరులో రూ.1,700 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. అయినా మీ హయాం లో ఇక్కడ చేసిన ఒక్క మంచిపని చెప్పండి? అంటూ బాబుకు సవాల్ విసిరారు. అబ్బయ్య చౌదరి. ఈ రాష్ట్రాన్ని ముం దుకు తీసుకెళ్లేది సీఎం జగన్ మాత్రమేనని ఈ మూడున్న రేళ్లలో మేనిఫెస్టోలో ఇచ్చిన తొంభై శాతం హామీలను నెరవేర్చారు. కానీ, చంద్రబాబు అయితే అధికారంలోకి వచ్చాక ఏ హామీని నెరవేర్చకుండా ప్రజలు అడుగుతారని భయంతో మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనుడు అని విమర్శించారు.
