సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నడిబొడ్డున అంబెడ్కర్ సెంటర్ నుండి టీపీ గూడెం రోడ్డు వైపు డిమార్ట్ వరకు నిర్మించిన ప్రతిష్టాకర రైల్వే అండర్ టర్నల్ బ్రిజ్ లో వాహనదారుల రాకపోకలను తాత్కాలికంగా నిన్నటి సోమవారం మధ్యాహ్నం నుండి నిషేదించారు. మొన్న ఆదివారం ట్రయిల్ రన్ గా మాత్రమే వాహనాలను అనుమతించామని, బ్రీజ్ కి అప్రోచ్ మెంట్ రోడ్డు వేసి ప్రధాన రహదారికి కలిపాక పూర్తీ స్థాయిలో అతి త్వరలో అధికారికంగా రైల్వే టర్నల్ బ్రిజ్ ను ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. మొన్న మన సిగ్మా న్యూస్ లో ఇంకా బ్రీజ్ అధికారికంగా ప్రారంభించలేదు అని తెలియజేశాము. రోజున్నర పాటు రయ్యి రయ్యి మని వాహనాలు తో అండర్ టర్నల్ లో దూసుకొనిపోయినవారు మరల అవకాశం కోసం కొద్దీ రోజులు ఆగాలి మరి..(ఫై చిత్రంలో తాజా పరిస్థితి చూడవచ్చు)
