సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సభ ను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, అంబేద్కర్ చిత్ర పటానికి పుష్ప మాల వేసి ఘన నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక స్వచ్చంధ సంస్థల నేతలు, వైసిపి నేతలు , మహిళలు పాల్గొని స్వర్గీయ అంబెడ్కర్ కు దేశానికీ ఆయన చేసిన సేవలు కొనియాడుతూ ఘన నివాళ్లు అర్పించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరగాలని అని, పోరాడి రాజ్యాంగం రూపంలో అమలు జరిగేలా చేసారో.. అలానే ప్రస్తుతం రాష్ట్రము సీఎం జగన్ తన పాలన లో అన్ని మతాల ప్రజలు సంక్షేమం కాంక్షిస్తూ వెనుకబడిన తరగతులకు, కులాల కు అధికారం లో సమభాగం పంచుతూ , ఎన్నో సంక్షేమ పథకాలతో అందరిని ఆదుకొంటూ అంబేద్కర్ కలలను నిజం చేస్తున్నారని, ఆయన పేరు కోనసీమ జిల్లా కు పెట్టి ఆయన సేవలపై అభిమానాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు
