సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో గత సోమవారం ఉదయం అల్ప పీడనం ఏర్పడింది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అనుకుంటే అది ఏకంగా నేడు, మంగళవారం తుపానుగా మారి తమిళనాడు–దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనిస్తున్నట్లు తాజా సమాచారం. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై కూడా పడనుంది. కాగా నేటి రాత్రికి ఆగ్నేయ బంగాళాఖాతం లో వాయుగుండంగా బలపడనుంది. అదే దిశలో పయనిస్తూ తుపానుగా బలపడి ఈ నెల 8న ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చే రి–దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో తీరానికి చేరుతుందని భారత వాతావరణవిభాగం (ఐఎం డీ)ప్రకటించింది. వచ్చే గురువారం, శుక్రవారాలలో దీని ప్రభావంతో దక్షిణ కోస్తా.. రాయలసీమపై అధిక ప్రభావం ఉంటుందని, తుపాను ప్రభావంతో ఈ నెల 8, 9 తేదీల్లోకోస్తాలో తీరం వెంబడి గంటకు 40నుం చి 50 కిలోమీటర్లు, గరిష్టం గా 60 కిలోమీటర్లవేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్య కారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
