సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేడు, బుధవారం ఉదయం ప్రారంభమయ్యా యి. ఈ క్రమం లో ఇటీవల మరణించిన తెలుగు ప్రముఖులు మాజీ ఎంపీలు సూపర్ స్టార్ కృష్ణ, మాజీ కేంద్రమంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, మాజీ కేంద్ర మంత్రి ములాయం సింగ్ యాదవ్, తదితరులకు పార్లమెంట్ ప్రజా ప్రతినిధిగా వారు దేశానికీ చేసిన సేవలకు ముందుగా లోక్సభ నివాళ్లు అర్పించింది. స్పీకర్, ఓం బిర్లా సంతాప సందేశం చదివిన తర్వాత సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోను వారికీ నివాళ్లు అర్పించారు. మరోవైపు.. రాజ్య సభ చైర్మెన్ గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కు శుభాకాం క్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఒక రైతు బిడ్డ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి అయ్యారని కొనియాడారు.
