సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు, గురువారం ఉదయం తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 10 కిలోమీటర్లవేగం తో పశ్చి మ వాయవ్య దిశగా శ్రీలంక, తమిళనాడు వైపు దూసుకు వస్తోందీ. జాఫ్నా కు (శ్రీలంక) 550 కిలోమీటర్లు, కారైకాల్కు 610 కిలోమీటర్లు, చెన్నై కి 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ తుపానుకు మాండూస్ అని పేరు పెట్టారు. 9వ తేదీ రాత్రి తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటుతుందని చెబుతున్నారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 65–75 కి.మీలు, గరిష్టంగా 85 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. తీరం దాటిన తర్వాత వాయుగుం డం గా బలహీనపడి రాయలసీమ వైపు కదులుతుందని చెబుతున్నారు. నేటి గురువారం నుంచి 10వ తేదీ వరకు తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.మాండూస్ ప్రభావం తో 8వ తేదీ నుంచి 3 రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. .తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాలను ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సముద్రం తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి.
