సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాండూస్ తుపాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. భీమవరంలో గత రాత్రి 10 గంటల నుండి భారీ వర్షం ప్రారంభం అయ్యి చెదురుమదురుగా పడుతూ నేటి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కొనసాగింది. తీవ్ర చలిగాలులతో పట్టణం అంతా సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ తలపిస్తుంది. ఇక పాలకొల్లు, తణుకు, నరసాపురం పరిసర ప్రాంతాలలో నేడు, శుక్రవారం ఉదయం నుండి చెదురుమదురుగా వర్షం పడుతుంది. భీమవరం, నరసాపురం సముద్రపు తీరప్రాంతాలలో గాలులు వేగంగా వీస్తున్నాయి. మత్యకారులను వేటకు వెళ్లవద్దని ఆదేశాలు ఉన్నాయి.జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు పరిస్థితిని గమనిస్తున్నారు. మరో 2 రోజుల పాటు తుపాను తీవ్రత కొనసాగనుంది.
