సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభుత్వ విద్య రంగం లో జగన్ సర్కార్ కీలకమైన ముందడుగు వేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రభుత్వ పాఠశాలల్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తాజగా ప్రవేశపెడుతుంది. మొదటి దశలో 1,000 ప్రభుత్వ స్కూ ళ్లకు సీబీఎస్ఈ బోర్డు అనుమతులిచ్చింది. దీంతో ఈ స్కూళ్లన్నిటిలో ఈ విద్యా సంవత్సరం నుంచే 8వ తరగతి విద్యా ర్థులంతా సీబీఎస్ఈ విధానంలో చదువుతారు. విద్యతో కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ స్కూల్ చదువులకు పోటీగా .. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అత్యధిక శాతం బడుగు, బలహీనవర్గాల పిల్లలే. వీరంతా ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందిపుచ్చుకునేలా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్య మాన్ని ప్రవేశపెట్టింది. మొదటి దశలో మొత్తం 1,308 ప్రభుత్వ స్కూళ్లకు అనుమతుల కోసం సీబీఎస్ఈ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. ఈ స్కూళ్లలో 1,229స్కూళ్లకు అఫ్లియేషన్ నంబర్ వచ్చినా చివరకు 1,000 ప్రభుత్వ స్కూళ్లకు సీబీఎస్ఈ బోర్డు అనుమతులు ఇచ్చింది. వీటిలో భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 16 స్కూల్స్ కు మాత్రమే అనుమతి లభించింది. ఏలూరు జిల్లాలో 36 స్కూల్స్ కు అనుమతి లభించింది. సీబీఎస్ఈ విధానానికి అనుగుణంగా ఇప్పటికే రాష్ట్రంలో 83,466 మంది టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. సీబీఎస్ఈ విధానం విద్యార్థుల్లో బలమైన పునాదులు వేస్తుందని అధికారులు, విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *