సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సత్తెనపల్లి లో నేడు, ఆదివారం జరిగిన జనసేన పార్టీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని, ప్రజలంతా కోరుకుంటే తాను సీఎం అవుతానన్నారు. స్థానిక ఎమ్మెల్యే ,మంత్రి అంబటి రాంబాబు నుద్దేశించి.. అంబటిది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమని, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని ఆయన ఒక మంత్రా? అని ప్రశ్నించారు.. తనను కాపు నేతలతో పచ్చి బూతులు తిట్టిస్తున్నారని అంబటి ఫై మండిపడ్డారు. జగన్ సర్కార్ BC లకు ఏమి చేసాడని, వాళ్లకు బిర్యానీ , రొయ్యల రోస్టులతో భోజనాలు పెట్టిస్తే చాల? వారిలో కొందరు నేతలు కారులు వేసుకొని తిరగడానికి డైరెక్టర్స్ పదవులు ఇస్తే సరిపోతుందా ? బీసీల అందరి పిల్లలు చదవడానికి ఫీజు రియంబర్స్ లు కడుతున్నారా? పెంక్షన్లు ఇస్తున్నారా? ఎదో నిబంధనలతో వాళ్లకు పధకాల లబ్ది లేకుండా చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వను.. అన్న మాటకు కట్టుబడి ఉన్నానని, అయితే తాను ఏ పార్టీకి కొమ్ముకాయనని, ఏ పార్టీకి అమ్ముడుపోయే ఖర్మ తనకు పట్టలేదన్నారు. తన సినిమాలు ఏపీలో ఆపేసినా భయం లేదన్నారు. త్వరలో వారాహి వాహనంలో ఏపీ రోడ్లపై తిరుగుతా.. ఎవరూ ఆపుతారో చూస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకుండా చేసే బాధ్యత తనదన్నారు.
