సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ పెదపాడు మండలం తాళ్లమూడి వద్ద జాతీయ రహదారిపై నేడు, ఆదివారం కారు డివైడర్ ను ఢీకొని దానిలో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలతో ఏలూరులోని ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన ముత్త సూర్యనారాయణ తన కుటుంబ సభ్యులతో కలసి ఈ కారులో గుంటూరులోని వివాహానికి హాజరయ్యాడు. తిరుగుప్రయాణం లో కాకినాడ వస్తుండగా ప్రమాదానికిగురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన భార్య సుగుణ సంఘటన స్థలంలో అక్కడికక్క డే మృతి చెందారు. సూర్యనారాయణను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
