సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మరో అల్పపీడనం ఏర్పడింది, మధ్య దక్షిణ బంగాళాఖాతం లో తూర్పు భూమధ్య రేఖ ప్రాంతానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడింది, ఇది స్థిరంగా కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లోపశ్చి మ వాయవ్య దిశలో నెమ్మదిగా కదులుతూ శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎం డీ) తాజా నివేదికలో తెలిపింది.దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై స్వల్పంగా ఉండే అవకాశం ఉందని ప్రకటించింది, ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణకోస్తాలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
