సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సర్గీయ వంగవీటి మోహన రంగా 34వ వర్ధంతి సందర్భముగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయన విగ్రహాలకు రాజకీయాలకు అతీతంగా నేతలు పుష్ప మాలలు సమర్పించి వారికీ ఘన నివాళ్లు అర్పించారు. భీమవరం తాలూకా ఆఫీస్ వద్ద ఉన్న వంగవీటి మోహన రంగా విగ్రహానికి స్థానిక ‘మోహనరంగా యూత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పులా మాలలతో అలంకరించి జోహార్ జోహార్ వంగవీటి మోహనరంగా అంటూ నేతలు ఘన నివాళ్లు అర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా అని వారి హక్కుల కోసం నిరాహార దీక్ష చేస్తూ పోరాడుతూనే దుష్ట శక్తుల చేతిలో హతం అయ్యారని, కానీ ఆయన స్ఫూర్తి పట్టుదల ఆయన మరణించి 34 ఏళ్ళ అయిన యువతరంలో సజీవంగా కొనసాగుతుందని వక్తలు పేర్కొన్నారు. తణుకు, తాడేపల్లి గూడెం, పాలకొల్లు, అత్తిలి పరిసర ప్రాంతాలలో చాల ఘనంగా వంగవీటి మోహన్ రంగా విగ్రహాలకు అభిమానులు జనసేన నేతలు నివాళ్లు అర్పించడం జరిగింది.
