సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసారు. భీమవరం నియోజకవర్గం పరిధిలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల జనవరి 3న భీమవరంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సౌజన్యంతో, ఉపాధి విభాగం, CDAP. ఆర్ డి.ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ జాబ్ మేళాలో సుమారు 14 కంపెనీల ప్రతినిధులు పాల్గొని 755 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ జాబ్ మేళాలో మ్యూట్ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, యాక్సిస్ బ్యాంక్, ట్రిజియో టెక్నాలజీస్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ వంటి 14 కంపెనీల్లో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, జి. I. యస్ ఇంజనీర్, సర్వీస్ ఇంజనీర్, కస్టమర్ రిలేషన్ కోఆర్డినేటర్, ఇన్‌సైడ్ కార్పోరేట్ సేల్స్, క్వాలిటీ కంట్రోల్, మిషన్ ఆపరేటర్, టెలీకాలర్స్, లోన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు ఉన్నాయని 18 నుండి 35 ఏళ్ళ వయస్సు కల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
