సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాపు సంక్షేమ సంఘ నేత,మాజీ నరసాపురం ఎంపీ , మాజీ హోమ్ మంత్రి, రాజకీయ కురు వృద్ధుడు హరిరామ జోగయ్య నేడు, మంగళవారం మీడియా తో మాట్లాడుతూ.. కాపులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడం ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ నేడు ఢిల్లీ వెళ్లి రేపు బుధవారం ప్రధానిని కలుస్తున్నారు. అయన కేంద్రం ఫై వత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాలలో వెనుకబడిన కులాల వారికి ఇచ్చిన 10% రిజర్వేషన్‌లో 5 శాతం ఏపీలో కాపులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 30 వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామన్నారు. లేదంటే జనవరి 2న నుంచి తాను నిర్వధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ‘‘నేను చచ్చి అయినా కాపులకు రిజర్వేషన్ సాధిస్తా’’ అంటూ హరిరామ జోగయ్య తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
