సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి నూతన జవసత్వాలు కోసం నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూలు ఖరారు అయ్యింది. వచ్చే 2023, జనవరి 27న లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకు ‘యువగళం ’ పేరు ఖరారైంది. యువగళం పేరుతో ప్రత్యేక జెండా రూపకల్పన చేశారు. నేడు, బుదవారం హైదరాబాద్ లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యువగళం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చిన్న రాజప్ప, వంగలపూడి అనిత, నక్కా ఆనందబాబు, కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు 4000 కిమీ మేర, నారా లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైంది. యువతను తెలుగు దేశం పార్టీలో భాగస్వామ్యం చేసే ప్యూహంతో లోకేష్ పాదయాత్ర ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
