సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారి దేవాలయంలో నేడు, గురువారం నూతన దివ్య అలంకరణలతో శ్రీ అమ్మవారి మూలవిరాట్ కు కళన్యాసం పూజలు నిర్వహించి భక్తులకు పునర్దర్శనం కల్పించారు. ఈ సందర్భముగా ఆలయ ప్రధానర్చుకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ,వేదపండితులతో కలసి నిర్వహించిన ప్రత్యేక పూజలులో, యాగంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుమారుడు గ్రంధి రవితేజ మరియు ఆలయ సహాయ కమిషనర్ కార్య నిర్వహణధికారి యర్రంశెట్టి భద్రాజీ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేస్వరరావు మరియు ధర్మకర్తలు సభ్యులు , ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు. ( ఫై తాజా ఫొటోలో అమ్మవారిని దర్శించుకోవచ్చు)
